: తెలంగాణ మంత్రుల శాఖల్లో మార్పు!... కసరత్తు పూర్తి చేసిన కేసీఆర్


కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు... రెండేళ్ల పాలనను త్వరలో పూర్తి చేసుకోనున్నారు. ఇప్పటికే తన కేబినెట్ లో ఓ మారు స్వల్ప మార్పులు చేర్పులు చేసిన కేసీఆర్... తాజాగా తన కేబినెట్ ను సమూలంగా ప్రక్షాళన చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేబినెట్ లోకి కొత్త నేతల చేరిక విషయంలో స్పష్టత లేకున్నా... ఇప్పటికే మంత్రులుగా కొనసాగుతున్న వారి శాఖలను సమూలంగా మార్పు చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు కొద్దిరోజుల క్రితమే కసరత్తు ప్రారంభించిన కేసీఆర్... ఇప్పటికే ఆ తంతును పూర్తి చేసినట్లు సమాచారం. ఇక మంత్రుల శాఖల మార్పునకు సంబంధించి నేడో, రేపో విస్పష్ట ప్రకటన వెలువడనుందన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏ మంత్రికి ఏ శాఖ దక్కుతుందోనన్న అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News