: చంద్రబాబుకు సత్కారాల వెల్లువ!... శాలువాలతో క్యూ కట్టిన మంత్రులు, అధికారులు


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేటి తెల్లవారుజామున సత్కారాలతో తడిసి ముద్దయ్యారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలోని తాత్కాలిక సచివాలయం ప్రదేశంలో నిర్మాణం పూర్తి చేసుకున్న రెండు గదులకు నేటి తెల్లవారుజామున నిర్దేశించిన సుముహూర్తం 4.01 గంటలకు చంద్రబాబు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఉన్నతాధికారులు, సెక్రటేరియట్ ఉద్యోగులు, ఏపీఎన్జీవోలు, స్థానిక నేతలు, రాజధాని కోసం భూములిచ్చిన రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్దేశిత ముహూర్తం కంటే ముందుగానే అక్కడకు చేరుకున్న చంద్రబాబు తాత్కాలిక రాజధానికి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ప్రారంభించిన గదుల్లోని ఓ గదిలో కూర్చున్న చంద్రబాబును తొలుత మంత్రులు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి పూల బొకేలను అందించిన మంత్రులు... నిర్దేశిత సమయం కంటే ముందుగానే తాత్కాలిక రాజధానికి ప్రారంభోత్సవం జరిగిన తీరుపై హర్షం వ్యక్తం చేశారు. మంత్రుల తర్వాత సచివాలయ ఉద్యోగులు, ఏపీఎన్జీవో ఉద్యోగులు, స్థానిక నేతలు ఘనంగా సత్కరించారు.

  • Loading...

More Telugu News