: స్పేస్ జర్నీతో కాలేయం అత్యంత తొందరగా దెబ్బతింటుందట!


స్పేస్ జర్నీ చేసే వారికి కాలేయం అత్యంత తొందరగా దెబ్బతింటుందట. ఈ మేరకు పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ పరిశోధన నిమిత్తం ఒక ఎలుకను అంతరిక్షంలోకి పంపించి పరిశీలించారు. కొన్నేళ్ల తర్వాత ఎలుక కాలేయంకు జరగాల్సిన నష్టం కేవలం 13 రోజుల్లోనే జరిగిందని ఆ పరిశోధనలో తేలింది. ఎలుక లివర్ సన్నబడటంతో పాటు కొన్ని రకాల మచ్చలు కూడా దానిపై ఏర్పడ్డాయట. అనారోగ్యకరమైన ఆహారం తీసుకున్నా కాలేయం ఇంత డామేజ్ జరగదని పరిశోధకులు పేర్కొన్నారు. కాగా, అంతకుముందు వరకు గుండె, ఎముకలు, ఇతర శరీర భాగాలపై మాత్రమే ప్రభావం ఉండేదని అన్నారు. తాజా పరిశోధన ద్వారా కాలేయంపై కూడా ప్రభావం పడుతుందని తేలింది. స్పేస్ లో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కనుక శూన్యంలోనే తేలుతూ ఉంటారు. శరీరంపై ఎటువంటి గురుత్వాకర్షణ ప్రభావం ఉండదు. దీంతో, ముఖ్యంగా గుండె, ఎముకలు, కండ భాగం, కాలేయం వంటి శరీర భాగాలు దెబ్బతింటాయి. 2030 కల్లా మార్స్ గ్రహంపైకి మానవులను పంపించాలనే ఉద్దేశంతో నాసా పలు ప్రయోగాలు చేస్తోంది. మార్స్ గ్రహంపైకి చేరుకోవాలంటే సుమారు 8 నుంచి 9 రోజులు పడుతుంది. అంటే... అన్ని రోజుల పాటు గురుత్వాకర్షణ శక్తికి దూరంగా ఉండాలి. గురుత్వాకర్షణ శక్తికి దూరంగా ఉండటం కారణంగా మనిషికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

  • Loading...

More Telugu News