: హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసం చూపించను: దర్శకుడు బోయపాటి
తన చిత్రాల్లో నటించే హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసం మాత్రం చూపించనని, కథకు వాళ్లు అవసరం ఉండేలా చూపిస్తానని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సరైనోడు చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్ కూడా అలాంటిదేనని, ఇప్పటి వరకు రకుల్ నటించిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాలో ఆమెను చూపించామన్నారు. అదేవిధంగా మరో హీరోయిన్ కేథరిన్ ను కూడా చాలా కొత్తగా చూపించామన్నారు.