: నా కెరీర్ లో మంచి మాస్ సినిమా ఇది: అల్లు అర్జున్


‘నా కెరీర్ లో మంచి మాస్ సినిమా సరైనోడు’ అని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, మంచి మాస్ సినిమా చేయాలనే కోరిక తనకు మొదటి నుంచి ఉండేదని, దానికి సరైన డైరైక్టర్ బోయపాటి శ్రీనేనని అన్నారు. తమ ఇద్దరికి మొదటి నుంచి చాలా పరిచయం ఉండేదన్నారు. ‘బోయపాటి శ్రీను గారు మొదటి నుంచి ఒకటే మాట అనేవారు. బాబూ, అందరూ షాకయ్యేలా మిమ్మల్ని ఒక మాస్ చిత్రంలో ప్రెజెంట్ చేస్తాను అనేవారు. ఆయనపై నమ్మకంతోనే ఈ సినిమా చేశాను. నేను ఊహించని విధంగా నన్ను సరైనోడు చిత్రంలో బోయపాటి గారు ప్రెజెంట్ చేశారు’ అని అల్లు అర్జున్ అన్నారు.

  • Loading...

More Telugu News