: పోలవరానికి 'నాబార్డు' నుంచి రుణం ఇప్పిస్తాం: కేంద్ర మంత్రి ఉమాభారతి
ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 'నాబార్డు' (జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి భాంకు) నుంచి రుణం ఇప్పిస్తామని కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమా భారతి అన్నారు. చిన్నచిన్న సమస్యలను అధిగమిస్తామని, పోలవరం ప్రాజెక్ట్ కు నిధుల కొరత రాకుండా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కాగా, కేంద్ర మంత్రి ఉమా భారతిని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, పలువురు టీడీపీ నేతలు ఈరోజు కలిశారు. పోలవరం ప్రాజెక్టు పనుల గురించి ఆమెకు వివరించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర సహకారం పూర్తిగా కావాలని ఆమెకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.