: ఆర్బీఐ గవర్నర్ కన్నా సలహాదారుల జీతభత్యాలే ఎక్కువ!
భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ కంటే ఆయనతో పనిచేసే సలహాదారుల జీతభత్యాలే ఎక్కువగా ఉన్నాయి. రఘురామ్ రాజన్ జీతభత్యాలు నెలకు రూ.1,98,700. రాజన్ మూల వేతనం రూ.90 వేలు, కరవు భత్యం రూ.1,01,700, ఇతరాలు రూ.7000. కాగా, రఘురామ్ రాజన్ జీతభత్యాల విషయమై ఆర్టీఐ కింద ఒక వ్యక్తి దాఖలు చేసిన అర్జీకి సంబంధిత అధికారులు సమాధానంగా పైవివరాలు పంపారు. ఇక రాజన్ తో కలసి పనిచేసే ఆర్బీఐ సలహాదారుల నెల జీతభత్యాల విషయానికొస్తే... గోపాలకృష్ణ సీతారాం హెగ్డేకు రూ.4 లక్షలు, అన్నామలై అరప్పులికు గౌండర్ రూ.2.20 లక్షలు, వి.కందసామికు రూ.2.1 లక్షలు ఇస్తున్నట్లు ఆర్బీఐ అధికారులు పేర్కొన్నారు.