: రాష్ట్రాభివృద్ధిపై కాకుండా ఎమ్మెల్యేల కొనుగోలుపై దృష్టి పెడుతున్న చంద్రబాబు: ఎంపీ మేకపాటి
ఏపీ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడి దృష్టి రాష్ట్రాభివృద్ధిపై కాకుండా ఎమ్మెల్యేల కొనుగోలుపై ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈరోజు అఖిలపక్షం సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం మేకపాటి మీడియాతో మాట్లాడారు. ఏపీలో జరుగుతున్న అనైతిక చర్యలను రాష్ట్రపతి, ప్రధానికి వివరిస్తామని అన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టానికి మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. తమ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు వారి సొంతపనులు చక్కబెట్టుకునేందుకని టీడీపీలోకి వెళుతున్నారని రాజమోహన్ రెడ్డి ఆరోపించారు.