: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెట్ కు అగ్నిప్రమాదం


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం సెట్ అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్ నెంబరు 25లోని ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ పక్కన ఉన్న బూత్ బంగ్లా ఆవరణలో ఈ చిత్రం సెట్ ఉంది. నిన్న సంభవించిన షార్టు సర్క్యూట్ కారణంగా మంటలు చేలరేగాయి. ఎండలు కూడా తీవ్రంగా ఉండటంతో మంటలు బాగా వ్యాపించడంతో సెట్ అగ్నికి ఆహుతైంది. ప్రమాద సమాచారం అందుకున్న ఫిలింనగర్, సనత్ నగర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. ఎంత ఆస్తినష్టం జరిగిందన్నది తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News