: మోదీ అపాయింట్ మెంట్ తీసుకోవడం నా చేతుల్లో లేదు: ఎంపీ హరిబాబు
ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ తీసుకోవడం అన్నది తన చేతుల్లో లేదని ఏపీ అఖిలపక్ష నేతలతో బీజేపీ ఎంపీ హరిబాబు అన్నారు. ప్రత్యేక రైల్వే జోన్ విషయమై మాట్లాడేందుకు తమను కేంద్రం దగ్గరకు తీసుకువెళ్లాలని కంభంపాటిని అఖిలపక్ష ప్రతినిధులు కోరగా ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ప్రధానిని కలిసేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకోవాలన్న ఎంపీ తీరుపై అఖిలపక్ష నేతలు అసహనం వ్యక్తం చేశారు.