: దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టాలి: రేవంత్ రెడ్డి
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని దేశీయ టెర్మినల్ కు టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పేరు పెట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలుగు ప్రజలకు ఎనలేని సేవ చేసిన ఎన్టీఆర్ కు తెలంగాణ రాష్ట్రంలో సముచిత స్థానం కల్పించాలన్నారు. దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కేంద్రం ఇప్పటికే తీర్మానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎన్టీఆర్ ను కేసీఆర్ ఎంతగా అభిమానిస్తారనే విషయం ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ 100 వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ప్రారంభోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో స్పష్టమైందన్నారు.