: రూ. 39 వేల కోట్లు నష్టపోయిన టాప్-5 కంపెనీలు!
మార్కెట్ కాపిటలైజేషన్ పరంగా టాప్-10 కంపెనీల్లోని 5 కంపెనీలు, 22తో ముగిసిన వారాంతంలో రూ. 38,969 కోట్లు నష్టపోయాయి. ఐటీ దిగ్గజం టీసీఎస్ అత్యధికంగా నష్టపోగా, రిలయన్స్, ఐటీసీ, సన్ ఫార్మా, హెచ్యూఎల్ కంపెనీలు నష్టాల బాటన పట్టాయి. ఇదే సమయంలో ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీలు లాభపడ్డాయి. టీసీఎస్ ఏకంగా రూ. 20,876 కోట్లు నష్టపోగా, సంస్థ మార్కెట్ కాప్ రూ. 4.76 లక్షల కోట్లకు తగ్గింది. రిలయన్స్ రూ. 8,651 కోట్లు నష్టపోగా, మార్కెట్ కాప్ రూ. 3.36 లక్షల కోట్లకు, ఐటీసీ రూ. 4,224 కోట్లు నష్టపోయి రూ. 2.62 లక్షల కోట్లకు తగ్గాయి. సన్ ఫార్మా రూ. 2,791 కోట్లు, హెచ్యూఎల్ రూ. 2,423 కోట్లు నష్టపోయినట్టు బీఎస్ఈ గణాంకాలు వెల్లడించాయి. కాగా, ఇన్ఫోసిస్ రూ. 9,601 కోట్లు, కోల్ ఇండియా రూ. 6,821 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 2,793 కోట్లు, ఒఎన్జీసీ రూ. 2,694 కోట్లు లాభపడ్డాయి. ఈ వారంలో సెన్సెక్స్ 211 పాయింట్లు పెరిగి 25,838 పాయింట్లకు చేరుకుంది.