: పార్టీ ఫిరాయింపులు సహజమే: మంత్రి రావెల
ప్రజాసేవకు ఎక్కడ అవకాశముందో అక్కడికి ఎమ్మెల్యేలు వెళ్తారని, పార్టీ ఫిరాయింపులు సహజమేనని ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ అప్రజాస్వామికవాది, నియంత, అవినీతి చక్రవర్తి అని మండిపడ్డారు. జగన్ కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని విమర్శించారు. వైఎస్సార్సీపీలో జగన్ ఒక్కరే మిగిలిపోతారని, ఆయన నియంతృత్వ పోకడలను భరించలేకనే ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వచ్చేస్తున్నారని ఆరోపించారు. సింగపూర్ లో మాదిరిగా రాష్ట్రంలోనూ ఏకైక పార్టీగా ‘తెలుగుదేశం’ అవతరించనుందని అన్నారు.