: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీలో విలీనం కాక తప్పదు: ఆనం వివేకానందరెడ్డి సంచలన వ్యాఖ్య
అతి త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంలో విలీనం కానుందని ఇటీవల తెలుగుదేశంలో చేరిన ఆనం వివేకానందరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి భవిష్యత్ లేదని జోస్యం చెప్పారు. ఈ ఉదయం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, వైకాపా నుంచి 34 మంది వస్తే, ఆ పార్టీ తెలుగుదేశంలో విలీనమైపోయినట్టేనని అన్నారు. జగన్ జైలుకు వెళ్లనున్నాడని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారని, పార్టీ కొవ్వొత్తిలా కరుగుతోందని తెలిపారు. వైకాపాలో తమకు భవిష్యత్ లేదని భావిస్తున్నందునే ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని అన్నారు. కాగా, ఆనం మాటలను పరిశీలిస్తే, మరో 20 మంది వరకూ ఎమ్మెల్యేల ఫిరాయింపులు తప్పవేమో!