: వైకాపాకు ఇంకో గుడ్ బై... అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కూడా!
వైకాపా నుంచి ఉత్తరాంధ్రకు చెందిన మరో ఎమ్మెల్యే ఫిరాయింపునకు రంగం సిద్ధమైంది. అధినేత జగన్ కు షాకిస్తూ, అరకు శాసన సభ్యుడు కిడారి సర్వేశ్వరరావు పార్టీని వదిలి తెలుగుదేశంలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ ఉదయం అరకు నేతలు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన, పార్టీలో చేరే విషయమై వారితో చర్చించినట్టు సమాచారం. కాగా, తాను ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరుతారన్న విషయాన్ని సోమవారం నాడు ప్రకటిస్తానని కిడారి వెల్లడించినట్టు కార్యకర్తలు తెలిపారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సైతం వైకాపాను వీడి తెలుగుదేశంలోకి జంప్ చేయనున్నట్టు ఈ ఉదయం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.