: ఇక తిరుగులేదు... టీఆర్ఎస్ మెడలు వంచుతాం: మల్లు భట్టి విక్రమార్క
పాలేరు ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించరాదన్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఇక తమకు తిరుగులేదని, టీఆర్ఎస్ మెడలు వంచుతామని ఆయన అన్నారు. తెలుగుదేశం, వైకాపాలు అభ్యర్థులను పెట్టకుండా, సుచరితా రెడ్డికి మద్దతిచ్చేందుకు ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు. ఎమ్మెల్యే చనిపోయినప్పుడు వచ్చే ఉప ఎన్నికల్లో పాత సంప్రదాయాలను గౌరవిస్తూ, విశ్వసనీయతను కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందు నిలుస్తుందని తెలంగాణ టీడీపీ నేత ఎల్.రమణ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు చంద్రబాబుతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.