: క్యూలో మరింతమంది... జగన్ కు ఈ పరిస్థితి ఎందుకంటే..!: వివరించిన మంత్రి చినరాజప్ప


జగన్ పార్టీ నుంచి రోజుకో ఎమ్మెల్యే ఎందుకు జారిపోతున్నారన్న దానిపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చినరాజప్ప మాట్లాడారు. ఎమ్మెల్యేలతో ఎలా నడుచుకోవాలో జగన్ కు తెలియదని, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే ప్రసంగించేందుకూ జగన్ అంగీకరించరని అన్నారు. ఇంకా ఎంతో మంది వైకాపా ఎమ్మెల్యేలు వస్తారని జోస్యం చెప్పిన చినరాజప్ప, తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వారంతట వారుగానే వస్తున్నారని అన్నారు. 12 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్, అందరిపై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. 'సేవ్ డెమోక్రసీ' అని ఆయన నోటివెంట రావడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News