: సేవలకు గుర్తింపు... మిసిసిపీలో ఓ వీధికి ఎన్నారై పేరు


అమెరికాలోని మిసిసిపీలో ఓ వీధికి ప్రవాస భారతీయుడు డాక్టర్ సంపత్ షివాంగీ పేరును పెట్టారు. ఓ రిపబ్లికన్ ప్రతినిధిగా ఈ ప్రాంతానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ, ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర గవర్నర్ ఫిల్ బ్రయాంట్ వెల్లడించారు. షివాంగీ పేరు మీద ఆ వీధికి 'డాక్టర్ సంపత్ షివాంగీ లేన్' అని పేరు పెట్టామని, మిసిసిపీ మానసిక వైద్య విభాగం బోర్డులో ఆయన్ను తిరిగి నియమిస్తున్నామని బ్రయాంట్ తెలిపారు. కాగా, తనకు ఈ గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చిన ప్రభుత్వానికి సంపత్ కృతజ్ఞతలు తెలిపారు. దీని ప్రోత్సాహంతో మరింతగా ప్రజలకు దగ్గరవుతానని తెలిపారు. 2005 నుంచి 2008 వరకూ యూఎస్ సెక్రటరీ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ విభాగంలో సలహాదారుగా, ఆపై 2014లో మానసిక వైద్య విభాగం చైర్మన్ గా కూడా ఆయన పనిచేశారు.

  • Loading...

More Telugu News