: పెను కష్టాల్లో విజయ్ మాల్యా... పాస్ పోర్టును రద్దు చేసిన విదేశాంగ శాఖ


ఇండియాలో బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు పైగా బకాయిలు పడి, వాటిని చెల్లించడంలో విఫలమై, గత నెలలో విదేశాలకు పారిపోయిన యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా పాస్ పోర్టును రద్దు చేసినట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. భారత పాస్ పోర్టు చట్టంలోని సెక్షన్ 10 (3) (సి) మరియు (హెచ్) నిబంధనల మేరకు పాస్ పోర్టును రద్దు చేసినట్టు వివరించారు. కాగా, ఆయనపై ఇండియాలోని పలు కోర్టుల్లో నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ అయిన సంగతి తెలిసిందే. ఇక భారత ప్రభుత్వం ఆయన్ను అప్పగించాలని బ్రిటన్ ను అధికారికంగా కోరనుంది. పాస్ పోర్టు రద్దుతో ఆయన మరిన్ని కష్టాల్లో పడ్డట్టే.

  • Loading...

More Telugu News