: ప్లీనరీలో పాల్గొనే అవకాశం 4 వేల మందికి మాత్రమే: తెలంగాణ మంత్రి ఈటల
బుధవారం నాడు ఖమ్మంలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీలో పాల్గొనే అవకాశం కేవలం 4 వేల మందికి మాత్రమే దక్కనుంది. ప్లీనరీకి పరిమితంగా ఆహ్వానాలు పంపుతున్నామని అర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్లీనరీకి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని వివరించారు. 27న ఉదయం 10 గంటల నుంచి సభ మొదలవుతుందని, ముందుగా ప్రతినిధుల సభ జరుగుతుందని పేర్కొన్నారు. పలు అంశాలపై తీర్మానాలు చేయనున్నామని, సాయంత్రం 4 గంటల నుంచి బహిరంగ సభ జరుగుతుందని వెల్లడించారు. తాము ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నామని, ఈ విషయమై ప్లీనరీలో చర్చ జరగనుందని ఈటల తెలిపారు.