: సెల్ఫీలు, ఆర్భాటాలు తప్ప మరేముంది?: నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డ కన్నయ్య కుమార్


జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్, నరేంద్ర మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో సెల్ఫీలు, మేకిన్ ఇండియా వంటి ప్రచార ఆర్భాటాలూ తప్ప మరేమీ లేదని ఆరోపించారు. వాస్తవానికి 'ఫేక్ ఇన్ ఇండియా' అనాల్సిన చోట మేకిన్ ఇండియా అంటున్నారని విమర్శించారు. తిలక్ నగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కన్నయ్య కుమార్ పాల్గొని ప్రసంగించారు. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, సెల్ఫీ విత్ డాటర్ అంటూ ప్రజలను మభ్యపెట్టడానికే మోదీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న హామీలన్నీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని, వాస్తవ పరిస్థితుల్లో ఒక్క హామీ కూడా నెరవేరడం లేదని అన్నారు. మోదీ మైనపు బొమ్మను తీర్చిదిద్దారని విన్నానని, అదే సమయంలో మరాఠ్వాడా రీజియన్ లో గుక్కెడు నీరు తెచ్చుకునేందుకు మండుటెండలో వెళ్లిన 12 ఏళ్ల బాలిక మరణించిందని గుర్తు చేస్తూ, 'ఆ మోదీ మైనపు బొమ్మను మరాట్వాడాలోనే పెట్టమందాం' అంటూ వ్యంగ్యంతో నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News