: కొంపముంచిన 400 గ్రాముల అధిక బరువు... ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ పోటీలకు వినీష్ ఫోగత్ డిస్ క్వాలిఫై!


ఒలింపిక్స్ రెజ్లింగ్ విభాగంలో జరుగుతున్న క్వాలిఫయింగ్ పోటీల్లో ప్రముఖ మహిళా రెజ్లర్ వినీష్ ఫోగత్ ప్రవేశాన్ని పొందలేకపోయింది. 21 ఏళ్ల ఈ రెజ్లర్ ఉండాల్సిన బరువు కన్నా 400 గ్రాముల అధిక బరువు వుండటంతో డిస్ క్వాలిఫై అయినట్టు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీంతో తాననుకున్న 48 కిలోల విభాగానికి పోటీ పడలేని పరిస్థితి ఏర్పడింది. బరువు సరిచూసుకోనందుకు ఆమెకు, ఆమె కోచ్ కి నోటీసులు పంపించినట్టు డబ్ల్యూఎఫ్ఐ అధికారి ఒకరు తెలిపారు. కాగా, వీనీష్ తో పాటు ఆమె సోదరులు బబితా ఫోగత్, గీతా ఫోగత్ లు రియో బలింపిక్స్ బెర్త్ కోసం ఈ నెల మొదటి వారం నుంచి బల్గేరియాలో ప్రత్యేక శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News