: మాజీ ముఖ్యమంత్రులకు జాక్ పాట్... పెన్షన్ ను 700 శాతం పెంచిన మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రులు జాక్ పాట్ కొట్టారు. మాజీ సీఎంల పెన్షన్ ను 700 శాతం పెంచుతూ, శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం నెలకు రూ. 26 వేలు పెన్షన్ పొందుతున్న మాజీ ముఖ్యమంత్రులు ఇకపై రూ. 1.7 లక్షల పెన్షన్ రానుంది. దీంతో పాటు పలు ప్రత్యేక సౌకర్యాలనూ కల్పించే జీవోను విడుదల చేశారు. ఈ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తో పాటు ఉమా భారతి, కైలాష్ సోషి, సుందర్ లాల్ ఫత్వా తదితరులు లాభపడనున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వేతనం రూ. 2 లక్షలుగా ఉంది. అయితే, మాజీ ముఖ్యమంత్రులు కేంద్రంలో లేదా రాష్ట్రంలో మంత్రిగా ఉంటే మాత్రం ఈ పెంపుదల వర్తించదని ప్రభుత్వం వెల్లడించింది.