: పాండేకు ఆటలమ్మ, పీటర్సన్ కు పిక్క పట్టేసింది!
ప్రస్తుత ఐపీఎల్ పోటీల తొలి దశలో సత్తా చాటిన కోల్ కతా నైట్ రైడర్స్ ఒక్కసారిగా కష్టాల్లో పడింది. జట్టులో ప్రధాన బ్యాట్స్ మన్ గా ఉన్న మనీష్ పాండే దూరమయ్యాడు. పాండేకు ఆటలమ్మ సోకడంతో, నేడు పుణెతో జరగనున్న కీలక మ్యాచ్ లో అడటం లేదు. అతనికి కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చారు. దీంతో ఈ సీజన్ పోటీలకు పాండే దాదాపు దూరమైనట్టే. ఇక పుణె జట్టులో కీలక ఆటగాడు కెవిన్ పీటర్సన్, శుక్రవారం నాడు బెంగళూరుతో ఆడుతున్న సమయంలో పిక్క పట్టేసిందట. దీంతో రిటైర్డ్ హర్ట్ గా ఫిజియోల సాయంతో మైదానాన్ని వీడిన ఆయన, ఈ సీజన్ మొత్తానికీ ఆడే అవకాశాలు లేనట్టే. దీంతో ఇద్దరు స్టార్ ఆటగాళ్లు లేకుండానే నేడు రెండు జట్లూ పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.