: ఉత్తరకొరియా మళ్లీ రెచ్చగొట్టింది...క్షిపణి ప్రయోగం


ఈ మధ్యకాలంలో ఉత్తర కొరియా చేసినన్ని క్షిపణి ప్రయోగాలు మరేదేశం చేయలేదనడంలో అతిశయోక్తికాదు. ఉత్తర కొరియా తాజాగా మరోసారి క్షిపణి ప్రయోగం చేసిందని దక్షిణ కొరియా ఆరోపించింది. ఉత్తర కొరియాలోని సముద్ర తీరం నుంచి క్షిపణి ప్రయోగం జరిగిందని దక్షిణ కొరియా వెల్లడించింది. ఉత్తర కొరియా పరీక్షించిన క్షిపణి సబ్ మెరేన్ నుంచి చేసిన ఖండాంతర క్షిపణి అయి ఉంటుందని పేర్కొంది. ప్రపంచంలోనే ఏ మూలకైనా అణుబాంబు ప్రయోగించగల సామర్థ్యం తమకు ఉందని ఉత్తర కొరియా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రపంచ దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ఉత్తర కొరియా పట్టించుకోకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News