: తెలంగాణలో ప్రాంతీయ తీవ్రవాదం వల్లే నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారు: రావెల వివాదాస్పద వ్యాఖ్యలు
తెలంగాణలో ప్రాంతీయ తీవ్రవాదం కారణంగానే పలు పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ మునుగుతున్న నావ అని అన్నారు. తగలబడుతున్న ఇల్లు, మునిగిపోతున్న నావ నుంచి అంతా బయటపడాలని చూస్తారని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీలో చేరుతున్నారని ఆయన చెప్పారు.