: పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా సుచరితా రెడ్డి పేరును ప్రకటించిన ఉత్తమ్‌కుమార్
ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఖరారైంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి భార్య సుచరితా రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం బరిలోకి దింపనుంది. సుచరితా రెడ్డి పేరును టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. అభ్యర్థి ఎంపికపై ఎంతో కసరత్తు చేసిన కాంగ్రెస్ నేతలు చివరికి సుచరితా రెడ్డిని పోటీలోకి దింపడానికి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తమ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, కాంగ్రెస్ చర్చల ఫలితంగా వైసీపీ పోటీనుంచి తప్పుకుంటే, మరో పార్టీ టీడీపీ పాలేరు ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై స్పష్టత రాలేదు.