: తమిళ ఎన్నికల సిత్రాలు...డిపాజిట్టుగా నాణేలను చెల్లించిన స్వతంత్ర అభ్యర్థి


తమిళనాట ఎన్నికల ఢంకా మోగడంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అభ్యర్థులు నామినేషన్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఓ స్వతంత్ర అభ్యర్థి ఎన్నికల అధికారి సహనానికి పరీక్ష పెట్టాడు. వివరాల్లోకి వెళ్తే...విల్లివాక్కం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందస్వామి నామినేషన్ వేసేందుకు షెనాయ్ నగర్ లోని ఎన్నికల కార్యాలయానికి వెళ్లారు. నామినేషన్ వేసే సందర్భంలో డిపాజిట్ గా చెల్లించాల్సిన పది వేల రూపాయల స్థానంలో ఏడు కేజీల బరువున్న బ్యాగును ఎన్నికల అధికారి ముందు పెట్టారు. మూటవిప్పిన అధికారి నాణేలను చూసి షాక్ అయినప్పటికీ...సహచరులకు వాటిని లెక్కించాల్సిందిగా సూచించారు. లెక్కసరిపోవడంతో ఆయన నామినేషన్ స్వీకరించి ఆయనను పంపించారు. ప్రజా సేవ కోసం ఎన్నికల బరిలో నిల్చున్నానని చెప్పిన కందస్వామి, డిపాజిట్ కోసం స్నేహితులు, బంధువులను ఆశ్రయించానని, వారు ఇచ్చిన మొత్తాన్ని ఎన్నికల అధికారికి చెల్లించానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News