: సినిమాలో తను చెప్పిన డైలాగులే సురేష్ గోపీని ఇప్పుడు వెక్కిరిస్తున్నాయి!
తాజాగా రాజ్యసభకు నామినేట్ అయిన సినీ నటుడు సురేష్ గోపీ మాలీవుడ్ లో పెద్ద యాక్షన్ హీరో. తన ప్రతి సినిమాలోనూ రాజకీయనాయకులు, రౌడీలను ఆయన చెడామడా తిట్టేస్తూ విశ్వరూపం ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఆయన ఎంపీ పదవి దక్కించుకోవడంతో గతంలో ఆయన నటించిన ఓ సినిమాలో నామినేటెడ్ ఎంపీలపై సంధించిన డైలాగ్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ డైలాగులేంటంటే... 'ఎన్నికల్లో ప్రజాభిమానం సంపాదించలేని రాజకీయ నాయకులే ఇలా దొడ్డిదారిన పదవులు సంపాదిస్తారు. అలాంటి నాయకులు సమాజానికి చీడపురుగుల్లాంటి వాళ్లు' అని, మరో సందర్భంలో 'బాగా డబ్బున్న ఎన్నారైలు, మద్యం వ్యాపారులు నల్లధనాన్ని ఎరగా వేసి, ఇలాంటి విలువైన పదవులు కొనుక్కొంటున్నారు' అంటూ ఆయన వల్లించిన డైలాగులు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.