: ట్వీట్‌తో సమస్యను పరిష్కరించేసుకున్న ఢిల్లీ మహిళ
ఢిల్లీకి చెందిన ఓ మహిళ తాను అందుకున్న రూ.58,042ల నీటి బిల్లును చూసి షాక్ తింది. వేలల్లో వచ్చిన ఆ బిల్లును చూసి గుండె గుభేలుమన్నా, తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, నీటిపారుదల శాఖ మంత్రి కపిల్‌శర్మకు చేసిన ట్వీట్‌తో సమస్యను పరిష్కరించుకుంది. ఇటీవల లెహర్ సేథీ అనే మహిళ ఇంటికి నీటి బిల్లు ఏకంగా రూ.58,042 వచ్చింది. దీంతో ముందు బిల్లు చెల్లించేసి, ఆ తర్వాత బిల్ రిసిప్ట్‌ను సీఎం కేజ్రీవాల్, మంత్రి కపిల్ మిశ్రాలకు ట్వీట్ చేసింది. దీంతో స్పందించిన మంత్రి కపిల్ మిశ్రా.. 'సమస్యను పరిష్కరించామని రెండు రోజుల్లో లెహర్ సేథీ డబ్బుని ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేస్తా'మని రీట్వీట్ ద్వారా తెలిపారు. తప్పు ఎవరైనా చేస్తారని, అయితే వెంటనే స్పందించి పరిష్కరించడం అభినందనీయమని పేర్కొంటూ లెహర్ సేథీ సంతృప్తిని వ్యక్తం చేసింది.