: అది డొనాల్డ్ ట్రంప్ జుట్టు కాదు... గడ్డి!


అమెరికా అధ్యక్షబరిలో నిలిచి, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ కు సోషల్ మీడియాలో విశేషమైన స్థాయిలో అభిమానులున్నారు. ప్రత్యేకించి ట్రంప్ హెయిర్ స్టైల్ కు కూడా అమెరికాలో అభిమానులు ఉన్నారు. ఆయన విగ్గులు వాడుతారని, నార్వేలోని క్వాలోయి దీవిలో డొనాల్డ్ ట్రంప్ కు ఓ విగ్గుల ఫ్యాక్టరీ కూడా ఉందని నార్వేకు చెందిన వీజీ టీవీ ఓ కథనం ప్రసారం చేసింది. ఆ టీవీ ప్రసారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 1,56,00,000 మంది వీక్షించారు. ఈ వీడియోలో వందలాది విగ్గులు ఆరబెట్టి కనిపిస్తాయి. ఇవి అచ్చం డొనాల్డ్ ట్రంప్ జట్టును పోలి ఉంటాయి. అయితే అవి విగ్గులు కాదని, నార్వేలో నది ఒడ్డున పెరిగే ఒకరకమైన గడ్డి అని, తడారిపోవడంతో ఆ గడ్డి అలా కనిపిస్తోందని వీజీ టీవీ తెలిపింది. ఇక చివర్లో అసలు విషయాన్ని చెబుతూ... డొనాల్డ్ ట్రంప్ జుట్టుకి, ఈ గడ్డికి పోలిక ఉండడంతో సరదాగా నవ్వుకోవడానికి ఈ వీడియో తయారు చేశామని, తాము చెప్పింది వాస్తవం కాదని వీజీ ఛానెల్ ముక్తాయించింది.

  • Loading...

More Telugu News