: రచయిత్రిగా మారిన సన్నీ లియోన్... కథల్లో శృంగార రసాన్ని ఒలికిస్తున్న అమ్మడు!


పోర్న్ ఫిలింస్ నుంచి వచ్చి బాలీవుడ్ లో నటిగా ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్ వివిధ రంగాల్లో తన ప్రతిభ నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. టీవీ హోస్ట్ గా యువకులను ఆకట్టుకుంది. ఆ మధ్య ఓ పాప్ సాంగ్ కు చిందేసి డ్యాన్సుల పరంగా కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా రచయితగా నిరూపించుకునేందుకు సిద్ధమైంది. 'జుగర్ నట్స్ బుక్స్' అనే యాప్ తనను కథలు రాయాలని కోరినప్పుడు తొలుత ఆశ్చర్యపోయినా రాస్తానని చెప్పానని తెలిపింది. ఇప్పటికి 'స్వీట్ డ్రీమ్స్' పేరుతో 12 కథలు రాశానని సన్నీ వెల్లడించింది. తనకు అప్పుడప్పుడు కొన్ని ఆలోచనలు వస్తుండేవని, వాటిని కథలుగా రాయాలన్న కోరిక కూడా ఉండేదని, అయితే అప్పట్లో రాయడం కుదరలేదని పేర్కొంది. ఇక ఇప్పుడు తాను రాస్తున్న కథలు ఎరోటిక్ ఫిక్షన్ గా అలరిస్తాయని చెప్పింది. కాగా, తన భర్తను బాలీవుడ్ హీరోగా చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న సన్నీలియోన్...అతనితో సినిమా తీసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తానే నిర్మాతగా మారుతానని గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News