: స్లో ఓవర్ రేట్ పర్యవసానం... కోహ్లీకి 12 లక్షల రూపాయల జరిమానా
ప్రస్తుత ఐపీఎల్ పోటీల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారీ జరిమానా పడింది. బ్యాటింగ్ లో అంత్యంత పటిష్ఠంగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ జట్టు బౌలింగ్ లో బలహీనంగా ఉంది. దీంతో భారీ స్కోరు సాధించినప్పటికీ దానిని కాపాడుకోలేక సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో కీలక సమయాల్లో ఎవరికి బౌలింగ్ ఇవ్వాలన్న విషయం తేల్చుకోలేక, జట్టులో సీనియర్లు డివిలియర్స్, వాట్సన్ లతో క్రీజులో చర్చలు జరుపుతున్నాడు. ప్రతి ఓవర్ కు ఇలా తాత్సారం చేస్తుండడంతో కోహ్లీ వ్యూహాన్ని రిఫరీ గుర్తించాడు. ఫాంలో ఉన్న బ్యాట్స్ మన్ ను విసిగించడంలో భాగంగా కోహ్లీ ఇలా లేట్ చేస్తున్నాడని అర్థం చేసుకుని అతనికి జరిమానా విధించారు. ఐపీఎల్ లో మారిన నిబంధనల ప్రకారం ఈ జరిమానా విధించారు. ఆ లెక్కన కోహ్లీకి 12 లక్షల రూపాయల జరిమానా పడింది.