: చిత్తూరు టీడీపీ ఆఫీస్ నూ టార్గెట్ చేసిన ఎమ్మార్పీఎస్... అరెస్ట్ చేసిన పోలీసులు


మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఏపీలో అధికార టీడీపీ కార్యాలయాలను టార్గెట్ చేసింది. కొద్దిసేపటి క్రితం కర్నూలులోని ఆ జిల్లా టీడీపీ కార్యాలయంపై ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేసిన కార్యకర్తలు టీడీపీ జెండాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటన జరిగిన కాసేపటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోనూ కలకలం రేగింది. చిత్తూరులోని పార్టీ జిల్లా కార్యాలయంపై దాడి చేసేందుకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పరుగులు పెట్టారు. అయితే దీనిపై కాస్తంత ముందుగానే సమాచారం అందుకున్న పోలీసులు ఎమ్మార్పీఎస్ కార్యకర్తల దాడి యత్నాన్ని తిప్పికొట్టారు. క్షణాల్లో రంగంలోకి దిగిన పోలీసులు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News