: 73 ఏళ్ల రాజకీయ కురువృద్ధుడిపై 23 ఏళ్ల నవ యువకుడి పోటీ!


కేరళ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో ఆసక్తికర పోటీ నెలకొంది. కేరళ సీఎం, రాజకీయాల్లో తలపండిన 73 ఏళ్ల ఊమెన్ చాందీపై ఈ దఫా ఓ 23 ఏళ్ల నవ యువకుడు పోటీకి దిగుతున్నాడు. వివరాల్లోకెళితే... కాంగ్రెస్ పార్టీకి చెందిన కేరళ సీఎం ఊమెన్ చాందీ... కొట్టాయం జిల్లా పుట్టుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఆ నియోజకవర్గం నుంచి 10 సార్లు పోటీ చేసి విజయం సాధించిన చాందీ... 11వ సారి కూడా అక్కడి నుంచే పోటీకి దిగుతున్నారు. ఇక కేరళలో మంచి పట్టున్న సీపీఎం ఈ దఫా ఊమెన్ చాందీపై 23 ఏళ్ల యువకుడిని పోటీకి దించేందుకు రంగం సిద్ధం చేసింది. సీపీఎం విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐలో పదేళ్లుగా పనిచేస్తున్న జేక్ సీ థామస్ ప్రస్తుతం... ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడిగా కొనసాగుతున్నాడు. చాందీపై పోటీకి దిగుతున్న సందర్భంగా థామస్ నిన్న మీడియాతో మాట్లాడుతూ సీఎంపై ఆరోపణలు గుప్పించాడు. 'చాందీపై వచ్చినన్ని అవినీతి ఆరోపణలు ఏ సీఎం పైనా రావడం ఇక్కడి ప్రజలు చూడలేదు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు. పుట్టుపల్లిలో అభివృద్ది పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నాయి. ప్రజలు ఎవరికి ఓటు వేయాలో ఆలోచించుకోవడానికి ఇదే సరైన సమయం’’ అని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News