: కర్నూలులో టీడీపీ ఆఫీస్ పై ఎమ్మార్పీఎస్ దాడి, ఫర్నీచర్ ధ్వంసం... దాడి వెనుక జగన్ హస్తముందన్న శిల్పా


రాయలసీమ ముఖద్వారం కర్నూలులో కొద్దిసేపటి క్రితం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) నేతలు రెచ్చిపోయారు. కర్రలు చేతబట్టి నగరంలోని టీడీపీ కార్యాలయంపై విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలు తేరుకునేలోగానే ఎమ్మార్పీఎస్ నేతలు పార్టీ కార్యాలయంలో బీభత్సం సృష్టించారు. ఈ దాడిలో పార్టీ కార్యాలయంలోని ఫర్నీచర్ ఫూర్తిగా ధ్వంసమైంది. దాడిపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వేగంగా స్పందించారు. తమ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి వెనుక విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హస్తముందని ఆయన ఆరోపించారు. పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మాదిగలకు చంద్రబాబు మాత్రమే న్యాయం చేస్తారన్న విషయాన్ని ఎమ్మార్పీఎస్ నేతలు గుర్తించాలని ఆయన కోరారు. ఉన్నట్టుండి టీడీపీ కార్యాలయంపై ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు దాడి చేయడం పెను కలకలమే రేపింది.

  • Loading...

More Telugu News