: ‘అనంత’లో వైసీపీ ఆగ్రహ జ్వాలలు!... చాంద్ బాషా దిష్టిబొమ్మకు నిప్పు


టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ వైసీపీని తీవ్ర అయోమయంలోకి నెట్టేస్తోంది. వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో నిన్నటిదాకా 12 మంది ఎమ్మెల్యేలు చేరితే... నేడు భారీ అనుచరగణంతో విజయవాడ వెళ్లిన అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా సైకిలెక్కేశారు. చాంద్ బాషా చేరికతో టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 13కు చేరింది. చాంద్ బాషా టీడీపీలో చేరడంపై వైసీపీ అనంతపురం జిల్లా కార్యకర్తలు భగ్గుమన్నారు. నగరంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టిన వైసీపీ కార్యకర్తలు చాంద్ బాషా దిష్టిబొమ్మకు నిప్పు పెట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News