: పార్లమెంటుకు చేరిన ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం
ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభంపై పార్లమెంట్‌లో చర్చించాలంటూ కాంగ్రెస్ నోటీసులిచ్చింది. కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు ఆనంద్ శర్మ ఈ విషయమై నోటీసులు సమర్పించారు. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశం ఆర్టికల్ 356ను ఉల్లంఘిస్తోందని తెలిపారు. త్వరలో నిర్వహించనున్న పార్లమెంట్ సమావేశాల్లో మొదటి రోజే ఈ అంశంపై చర్చించడానికి అనుమతివ్వాలని కోరారు. ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభంపై చర్చించడం కోసం పార్లమెంటులో మొదటిరోజు చర్చకు నిర్దేశించిన ఇతర అన్ని అంశాలను వాయిదా వేయాలని కోరారు.