: మాల్యాపై దేశ బహిష్కారం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నాం: ఎంఈఏ
బ్యాంకులకు కోట్లాది రూపాయల రుణాలను ఎగవేసి విదేశాలకు వెళ్లిన కేసులో విజయ్ మాల్యా ఎన్నో చిక్కుల్లో ఇరుక్కుంటున్న విషయం తెలిసిందే. మాల్యా ముక్కు పిండి ఆయన తీసుకున్న రుణాన్ని వసూలు చేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే తాజాగా ఈ కేసులో మాల్యాపై దేశ బహిష్కరణ విధించాలని విదేశీ వ్యవహారాల శాఖ(ఎంఈఏ)ను ఈడీ కోరింది. మాల్యాపై దేశబహిష్కరణ చర్యలు మొదలుపెడితే ఆయనను బ్రిటన్ నుంచి వెనక్కి పంపించాల్సిందిగా ఆ ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉంటుందని ఈడీ పేర్కొంటుంది. ఈ విషయంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు ఎంఈఏ చెప్పింది.