: థాయ్‌లాండ్ మాజీ ప్రధాని బన్ హార్న్ శిల్పా అర్చా మృతి
థాయ్ ల్యాండ్ మాజీ ప్రధాని బన్ హార్న్ శిల్పా అర్చా(83) మరణించారు. ఆస్తమాతో బాధపడుతున్న ఆయన రెండు రోజుల క్రితం బ్యాంకాక్‌లోని శిరిరాజ్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆయన ఈ రోజు ఉదయం మరణించారని శిరిరాజ్ ఆసుపత్రి తెలిపింది. థాయ్‌లాండ్ 21వ ప్రధానిగా ఆయన 1995 లో బాధ్యతలు చేపట్టారు. అయితే, థాయ్ ల్యాండ్ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఏడాదికే ఓ కుంభకోణం ఆరోపణలతో బన్ హార్న్ శిల్పా అర్చా పదవిని కోల్పోయారు.