: కృష్ణా జిల్లా పెడన వీధుల్లో నారాయణ!... పొద్దున్నే తనిఖీలకు వచ్చిన పురపాలక శాఖ మంత్రి


ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ నేటి ఉదయమే కార్యరంగంలోకి దిగిపోయారు. నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణంలో నిత్యం తలమునకలై ఉంటున్న నారాయణ... నేటి ఉదయం తన సొంత శాఖకు సంబంధించిన వ్యవహారాల పర్యవేక్షణకు బయలుదేరారు. కృష్ణా జిల్లా పెడన మునిసిపాలిటీలో వాలిపోయిన నారాయణ... పట్టణంలోని వీధుల్లో తిరిగి ప్రజలతో మమేకమయ్యారు. సమస్యలపై ఆరా తీశారు. తాగు నీటి సమస్య వేధిస్తోందని జనం చెప్పడంతో అక్కడికక్కడే అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. తాగు నీటి సమస్య ఉత్పన్నం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News