: జగన్ అక్రమాస్తుల కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపులు!


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో ఇటీవల పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులపై నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణకు హాజరయ్యే విషయంలో జగన్ కు మినహాయింపు లభించింది. కేసుపై కోర్టు విచారణ వేగం పుంజుకున్న నేపథ్యంలో ప్రతి శుక్రవారం జగన్ మొన్నటిదాకా కోర్టుకు పరుగులు పెట్టారు. అయితే విపక్ష నేత హోదాలో ఉన్న తనపై పలు కీలక బాధ్యతలున్నాయని చెప్పిన ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. జగన్ వినతికి సానుకూలంగా స్పందించిన కోర్టు ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇచ్చింది. ఇదే కేసులో దాల్మియా సిమెంట్స్ అధినేత పునీత్ దాల్మియాకు కూడా కోర్టు మినహాయింపునిచ్చింది. నిన్నటి విచారణ సందర్భంగా అరబిందో ఫార్మా ఎండీ నిత్యానందరెడ్డితో పాటు ప్రముఖ ఆడిటర్ కోటేశ్వరరావులకు కూడా వ్యక్తిగత హాజరు నుంచి కోర్టు మినహాయింపునిచ్చింది.

  • Loading...

More Telugu News