: సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు.... రేపటి జడ్జీల సదస్సుకు హాజరు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేటి సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. మరికాసేపట్లో పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు... జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాలుపంచుకుని సాయంత్రానికి తిరిగి విజయవాడ చేరుకుంటారు. ఆ వెంటనే ఆయన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కనున్నారు. రేపు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరగనున్న హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సమావేశానికి ఆయన హాజరవుతారు. అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్న ఈ సదస్సులో చంద్రబాబు కీలక ప్రసంగం చేయనున్నారు. సదస్సు ముగిసిన వెంటనే ఆయన ఢిల్లీలో విజయవాడ ఫ్లైట్ ఎక్కేస్తారు. ఆదివారం మధ్యాహ్నంలోగానే ఆయన విజయవాడ చేరుకుంటారు.