: షేక్ స్పియర్ రచనల్లోని వాక్యాలు...మన నిత్య సంభాషణల్లో!
విలియమ్ షేక్ స్పియర్... ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రసిద్ధ ఆంగ్ల రచయిత. హాస్యం, శృంగారంతో పాటు హ్యామ్లెట్, ఒథెల్లో, మ్యాక్ బెత్ వంటి ఎన్నో విషాదభరిత నాటకాలు రాసిన షేక్ స్పియర్ సమకాలీన కవిత్వం అజరామరం. ప్రపంచానికి ఇంత విలువైన సాహిత్యాన్ని అందించిన ఆయన 1564, ఏప్రిల్ లో జన్మించారు. ఆయన పుట్టిన తేదీ మాత్రం తెలియదు. ఆయన మరణించింది 1616 ఏప్రిల్ 23. ఈ సందర్భంగా షేక్ స్పియర్ 400వ వర్ధంతి కార్యక్రమాలను ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాసిన పలు సూపర్ హిట్ నాటకాల్లోని కొన్ని వాక్యాలు మన నిత్య జీవితంలో జరిగే సంభాషణల్లో ఉపయోగిస్తుంటాము. అవి ఏమిటంటే... * గ్రీన్ - ఐడ్ మాన్ స్టర్ అర్థం : అసూయ * లవ్ ఈజ్ బ్లైండ్ అర్థం : మనం ఎవరి ప్రేమలో నైనా పడితే, ఇంకెవరినీ పట్టించుకోలేం. దానినే ప్రేమ గుడ్డిది అని కూడా అంటుంటాం. * టు వియర్ యువర్ హార్ట్ ఆన్ యువర్ స్లీవ్ అర్థం : భావోద్వేగాలను బహిరంగపరచమని * బ్రేక్ ద ఐస్ అర్థం : సంభాషణ ప్రారంభించమని. షేక్ స్పియర్ రచనల్లో ఉపయోగించిన ఇటువంటి వాక్యాలు ఎన్నో మనం నిత్యం జరిపే సంభాషణల్లో ఉపయోగిస్తుండటం గమనార్హం.