: చంద్రబాబుతో నాకెటువంటి విభేదాలు లేవు!: మంత్రి నారాయణ
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడితో తనకు ఎటువంటి విభేదాలు లేవని, ఇటీవల బాబు కేటాయించిన ర్యాంకుల్లో తనకు చివరి స్థానం దక్కిందన్న బాధ కూడా లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జూన్ లో ముహూర్తాలు లేనందునే ఈ నెల 25వ తేదీన సచివాలయ ప్రారంభోత్సవం చేస్తున్నామన్నారు. మరో రెండంతస్తుల భవనాలకు రెండు రోజుల్లో టెండర్లు పిలవనున్నామన్నారు.