: 25న నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు


ఈ నెల 25న ఆంధ్రప్రదేశ్ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. 25వ తేదీ తెల్లవారుజామున 4.01 గంటలకు సచివాలయాన్ని ప్రారంభించాలని ముహూర్తం నిర్ణయించారు. వేరే ముహూర్తాలు లేనందున లాంఛనంగా ఆ తేదీన ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా, నూతన సచివాలయ నిర్మాణానికి రూ.318 కోట్ల వ్యయం అవుతుందని సీఆర్డీఏ గతంలో అంచనా వేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ముఖ్యమంత్రి, న్యాయమూర్తులు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు, అఖిల భారత సర్వీసు ఉద్యోగులకు ప్రభుత్వ నివాస సముదాయాల నిర్మాణాలను కూడా 2019-20 నాటికి పూర్తి స్థాయిలో నిర్మించాలని సీఆర్డీఏ లక్ష్యాలుగా ఉన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News