: పాకిస్థాన్ రాజకీయనాయకుల్లో శ్రీమంతుడు నవాజ్ షరీఫ్... 'పనామా పేపర్స్' చెప్పింది నిజమే!
పనామా పేపర్స్ లో స్థానం సంపాదించుకున్న పాకిస్థాన్ దేశాధ్యక్షుడు నవాజ్ షరీఫే ఆ దేశ రాజకీయనాయకుల్లో అత్యంత ధనవంతుడని తేలింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తన ఆస్తుల వివరాలను నవాజ్ షరీఫ్ వెల్లడించారు. వీటి వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. తన ఆస్తులను 200 కోట్ల రూపాయలుగా షరీఫ్ పేర్కొన్నారు. తన ఆస్తుల్లో సింహభాగం తన కుమారుడు పంపినవేనని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆయన ఆస్తులు గత నాలుగేళ్లలో వంద కోట్ల రూపాయలు పెరిగి, 200 కోట్ల రూపాయలకు చేరాయి. తనకు విదేశాల్లో ఎలాంటి ఆస్తులు లేవని ఆయన స్పష్టం చేశారు. తన దగ్గర టయోటా ల్యాండ్ క్రూయిజర్, రెండు మెర్సిడెస్ బెంజ్ వాహనాలు ఉన్నాయని ఆయన తెలిపారు. దీంతో పాకిస్థాన్ పార్లమెంటులో అత్యంత ధనికుడిగా ఆయన నిలిచారు. ఆయన తరువాతి స్థానాల్లో ఆ దేశ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి షాహిద్ ఖాఖాన్ అబ్బాసీ, ఎంపీలు ఖయాల్ జమాన్, సాజిద్ హుస్సేన్ ఉన్నారు.