: ‘శ్రీ హిల్స్’ యాప్ ను ఆవిష్కరించిన ఏపీ సీఎం


శ్రీ హిల్స్ మొబైల్ యాప్ ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలో పుణ్యక్షేత్రాల సందర్శన, తిరుమల దర్శనం గురించిన వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. శ్రీ హిల్స్ మొబైల్ యాప్ ను ఏడుగురు ఇంజినీర్లు రూపొందించారు. కాగా, చిత్తూరు జిల్లాలో పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. తిరుపతి, మంగాపురం, శ్రీ కాళహస్తి, కాణిపాకం వంటి మొదలైన పుణ్య క్షేత్రాలకు పలు ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. కలియుగ వైకుంఠం తిరుమలలో అయితే నిత్యం భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంటుంది. కలియుగ దైవాన్ని దర్శించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు నిత్యం వస్తూనే ఉంటారు.

  • Loading...

More Telugu News