: రోజాను ఎన్నుకున్నందుకు నగరి ప్రజలు బాధపడుతున్నారు: ముద్దుకృష్ణమ నాయుడు
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై తెలుగుదేశం సీనియర్‌నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరోసారి మండిపడ్డారు. ఈరోజు విజయవాడలో ఆయన మాట్లాడుతూ... రోజాను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు నగరి నియోజకవర్గ ప్రజలు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. రోజా తన పద్ధతి మార్చుకోవాలని ముద్దుకృష్ణమ నాయుడు సూచించారు. నగరి మున్సిపాలిటీలో అధిక పన్నుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ ఆయన సీఎం చంద్రబాబుతో వివరించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. నగరి మున్సిపాలిటీలో పన్నుల విధానంపై పాత పద్ధతినే కొనసాగించాలని సీఎం మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారని పేర్కొన్నారు.