: నీకు నువ్వు నచ్చనప్పుడు ఎంత ఎదిగినా వేస్టే!: నందమూరి బాలకృష్ణ
నీకు నవ్వు నచ్చితే ఏం చేసినా బాధపడాల్సిన అవసరం లేదని సినీ నటుడు బాలకృష్ణ తెలిపారు. హైదరాబాదులోని అన్నపూర్ణా స్టూడియోస్ లో జరిగిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా ముహూర్తపు షాట్ సందర్భంగా అభిమానులతో మాట్లాడిన బాలయ్య, మనకు మనం నచ్చడం ప్రధానమని అన్నారు. నీకు నువ్వు నచ్చనప్పుడు జీవితంలో ఏం సాధించినా ఉపయోగం లేదని చెప్పారు. నీకు నువ్వు నచ్చినప్పుడు ఏం చేసినా బాధపడాల్సిన అవసరం లేదని, ఎవరి మెహర్బానీ కోసం పాకులాడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. 'గౌతమీ పుత్ర శాతకర్ణి' కథ అద్భుతంగా ఉందని, అందుకే తానీ సినిమాను అంగీకరించానని ఆయన తెలిపారు. అంతా సానుకూల దృక్పథంతో సాగితే అంతా మంచే జరుగుతుందని ఆయన తెలిపారు.